రాత్రికి ఆకాశం వైపు చూడండి.. మార్స్ కనిపిస్తోంది

మరికొన్ని గంటల్లో ఆకాశం అద్భుతం కనిపిస్తుందని ప్రకటించింది నాసా. రాత్రికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. దక్షిణం వైపు.. ఆకాశంలో చూస్తే అరుణగ్రహం చూడముచ్చటగా కనిపిస్తుందంట. దీనికి కారణం.. భూమికి మరింత దగ్గరగా ఈ గ్రహం రావటమే కారణం. ఎన్ని కిలోమీటర్ల దగ్గరగానో తెలుసా.. 5.75 కోట్ల కిలోమీటర్ల సమీపంలోకి. సూర్యుడు – భూమి మధ్యలోకి ఈ అరుణ గ్రహం వస్తుందని.. ఇది పెద్దదిగా, స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించింది నాసా.

ప్రపంచంలో ఇప్పటికే ఈ వింత కొన్ని దేశాల్లో కనువిందు చేస్తోంది. అమెరికా ఆకాశంలోకనిపించిన మార్స్ ను, శాటిలైట్లు తీసిన వీడియోలను నాసా విడుదల చేసింది. ప్రస్తుతం అరుణగ్రహం దుమ్ము, ధూళితో నిండి ఉందని.. భారీ తుఫాన్ వచ్చిందని వెల్లడించింది. దుమ్ము, ధూళి తుఫాన్ వల్ల మార్స్ పై వాతావరణం బీభత్సంగా ఉందని తెలిపింది. మార్స్ ను చాలా స్పష్టంగా, చాలా దగ్గరగా ఇండియాలోనూ కనిపించనుంది. సో.. రాత్రికి మబ్బులు లేకపోతే ఓసారి ఆకాశంలో దక్షిణం వైపు చూస్తే పెద్ద స్టార్ ఒకటి కనిపిస్తోంది. అదే మార్స్..

Posted in Uncategorized

Latest Updates