రాత్రిపూట రోడ్లపై కనిపించారో జైలే : విద్యార్థులకు పోలీసుల కౌన్సిలింగ్

అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువకులపై నిజామాబాద్ పోలీసులు పంజా విసిరారు. ఇటీవల దొంగతనాలు, ఒంటరి మహిళలపై వేధింపులు జరుగుతున్న క్రమంలో జూలై (27) నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిషన్ చబుత్ర నిర్వహించారు పోలీసులు. 11 గంటలు దాటాక రోడ్లపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 100 మందికి పైగా యువకులు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లైసెన్స్ లేకుండా బైక్స్ నడిపినవారు, డ్రంక్ అండ్ డ్రైవ్ వారు కూడా ఉన్నారు. పట్టుబడ్డ యువకులకు కౌన్సిలింగ్ ఇచారు పోలీసులు. అర్దరాత్రి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

చదువుకోవాల్సి వయసులో ఇలా రోడ్లమీద తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు అనడంతో..విద్యార్థులు బోరునా విలపించారు. ఇదే ఫస్ట్ టైమని..ఇకనుంచి ఇలా చేయమని పోలీసులను రిక్వెస్ట్ చేసుకున్నారు విద్యార్థులు. దీంతో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామన్న పోలీసులు విద్యార్థులను, యువకులను వదిలేశారు. ఇకనుంచి నిజామాబాద్ లో ఎక్కడైనా రాత్రి 11 దాటాకా పిల్లలు, యువకులు గుంపులుగా కనిపిస్తే.. జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates