రాత్రి దొంగలు.. పుకార్లు నమ్మొద్దు : డీజీపీ

DGPకిడ్నాపర్లు, హంతకులు రాత్రిపూట తిరుగుతూ దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్నారనే పుకార్లను నమ్మొద్దన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. చిన్నపిల్లలను ఎత్తికెళ్లి హతమార్చి అవయవాలను అమ్ముకుంటున్నారని పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం (మే-22) ట్విట్టర్ ద్వారా స్పందించారు డీజీపీ. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అవాస్తవాలను నమ్మొద్దని ట్విట్ చేశారు డీజీపీ మహేందర్‌రెడ్డి. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పలు గ్రామాల్లో ప్రజలు రాత్రి నిద్రలుమాని గస్తీ కాస్తున్నారని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమన్నారు. మీ భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. డయల్ 100, ట్విట్టర్, ఫేస్‌ బుక్, సమీప పోలీస్ స్టేషన్‌ లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని చెప్పారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేదర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates