రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు : RBI

BAపన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (మార్చి 31న) బ్యాంకులు రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది RBI. బ్యాంకులతో పాటు అన్ని RBI బ్రాంచీల ఆఫీసులూ  రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది.
అంతేకాక శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్‌ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. మార్చి-31తో ఈ 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అంతేగాక ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు శనివారం ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు వెల్లడించింది RBI. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ఇక ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ వంటి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలూ శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపిన RBI..  ఏప్రిల్‌ 2న బ్యాంకులు సెలవు పాటించనున్నట్టు వెల్లడించింది.

Posted in Uncategorized

Latest Updates