రానాకి పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు దగ్గుబాటి రానా పుట్టినరోజు. లీడర్ సినిమాతో తనదైన స్టైల్లో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో బాహుబలితో విలన్ గాను అలరించాడు. ఆయన నటించిన కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, ఆ తర్వాత వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోగా నటించి మంచి మార్కులే కొట్టేశాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ లో నటిస్తున్నాడు.

ఈ మూవీలో ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేస్తున్నాడు రానా. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ లో రానా లుక్ విడుద‌ల చేసింది సినిమా యూనిట్. ఇందులో రానా లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. టాలీవుడ్‌ తో  పాటు మిగ‌తా ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు కూడా రానాకి ట్విట్ట‌ర్ వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మరిన్ని వైవిధ్యభరితమైన సినిమాలు తీయాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే రానా.

 

Posted in Uncategorized

Latest Updates