రాఫెల్ ఇష్యూ : దుష్ప్రచారంపై యుద్దం చేస్తామన్న నిర్మలా సీతారామన్

రాఫెల్ డీల్ కి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోడీని దొంగగా అభివర్ణించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా రాఫెల్ డీల్ విషయంలో కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో…. కాంగ్రెస్‌ చేస్తోన్న ఈ దుష్ర్పచారంపై తాము పోరాడనున్నామని, దీనిపై దేశవ్యాప్తంగా ప్రచారం చేపడతామని కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం(సెప్టెంబర్-24) తెలిపారు. . దీనిపై దేశవ్యాప్తంగా కొందరు బీజేపీ నాయకులు మాట్లాడతారన్నారు. అప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దురుద్దేశంతో చేస్తోన్న ప్రచారంపై పోరాడాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates