రాఫెల్ ఇష్యూ : ప్రశ్నిస్తే…ప్రధాని ఇలా చూస్తారన్న రాహుల్

రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇప్పటికే మోడీని దొంగగా అభివర్ణించిన రాహుల్…ఇవాళ(సెప్టెంబర్-25) మరోసారి ఈ అంశంపై స్పందించారు.
మంగళవారం(సెప్టెంబర్-25) రాఫెల్ డీల్ గురించి రాహుల్ మాట్లాడుతూ….ప్రధాని మోడీని హేళన చేసే ప్రయత్నం చేశారు. 45 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ సంస్థకు రాఫెల్ డీల్‌ ను ఎందుకు అప్పగించారని ప్రధాని మోడీని ప్రశ్నిస్తే…..కనీసం నా కళ్లలోకి కూడా మోడీ చూడలేకపోయారని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన దిక్కులు ఎలా చూశారో రాహుల్ చేసి చూపించారు. ఓసారి పైకి… ఓసారి పక్కకు…ఓసారి కిందికి రాహుల్ చూశారు.

Posted in Uncategorized

Latest Updates