రాఫెల్ డీల్ : ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన భాధ్యత ఉంది

రాఫెల్ యుద్ధవిమానాలకు సంబంధించి.. ప్రధాని, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని. డిఫెన్స్ సీక్రెట్స్ బయటపెట్టకూడదన్నది నిజమే… కానీ దేశ భద్రతకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చుపెడుతున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు ఆంటోనీ. ఫ్రాన్స్ ప్రభుత్వమే రాఫెల్ యుద్ధవిమానాల రక్షణ, భద్రత, నిర్వహణ సామర్థ్యాన్ని బయటపెట్టినప్పుడు.. వాటిని దేశం ముందు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని నిలదీశారు. 2008లో యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ధవిమానాల కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిందన్నారాయన. రాఫెల్ డీల్ లో అవినీతి జరిగినట్టు కాగ్, పార్లమెంట్ అకౌంట్స్ కమిటీ కూడా నిర్దారించాయని గుర్తుచేశారు. ఫ్రాన్స్ ప్రతినిధులు రాహుల్ కు రాఫెల్ డీల్ గురించి చెప్పారు కాబట్టే.. ఆయన ఆ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారన్నారు ఆంటోని. రాఫెల్ ఒప్పందం దేశానికి సంబంధించి ఖచ్చితంగా విశ్వాస ఉల్లంఘనే అన్నారు. ఇక భద్రతకు సంబంధించిన రహస్యాలు చెప్పకపోయినా… కాస్ట్ అనేది సీక్రసీలోకి రాదన్నారు మరో మాజీ మంత్రి ఆనంద్ శర్మ

 

Posted in Uncategorized

Latest Updates