రాఫెల్ డీల్ పై అనుమానాలున్నాయి: కమల్ హాసన్

రాఫెల్ డీల్ అంశం దేశాన్ని షేక్ చేస్తోంది. ఈ విషయంలో కేంద్రం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.. తాజాగా ఈ అంశం పై నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో కుంభకోణం జరిగిందని అనుమానాలున్నాయని కమల్ అన్నారు. ఈ డీల్ లో కుంభకోణం జరిగిందని తాము ఆరోపించడం లేదని.. కేవలం అనుమానాలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. అనుమానాన్ని నివృత్తి చేసేందుకు విచారణ జరిపించాలని కోరారు.

 

Posted in Uncategorized

Latest Updates