రాఫెల్ ఢీల్: ట్యాంక్ బండ్ పై బీజేపీ నాయకుల ధర్నా

రాఫెల్ డీల్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు దర్నా నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. బీజేపీ పై ఆధారాల్లేని ఆరోపణలు చేసి బురద చల్లాలని అనుకుంటే చూస్తూ కూర్చోమన్నారు. రాహుల్ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని అన్నారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్ అవినీతి ఉంటుందని… కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ గాఢీ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్దిరాలేదని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని ఆయన ఆరోపించారు.

రాఫెల్ పై సుప్రీం తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని లక్ష్మణ్ అన్నారు. క్షమాపణ చెప్పడం కాదని, నోరు అదుపులో పెట్టులోవాలని కోర్టు చెప్పిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత సైన్యం ప్రపంచమంతటికి ఆదర్శమని… కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ ధర్నాలో……. ఎమ్మెల్సీ రామచందర్ రావు, పొంగులేటి, సుధాకరరెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Updates