రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..లోక్ సభ వాయిదా

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘాన్ని ఏర్పాటు చేయాల‌ని ఇవాళ విప‌క్షాలు లోక్‌ స‌భ‌లో డిమాండ్ చేశాయి. లోక్‌ స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. కొత్త‌గా ఎన్నికైన ఎంపీలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ త‌ర్వాత స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ ఎంపీల‌కు నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌శ్నోత్త‌రాలను చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు స‌భ‌లో నినాదాల‌తో హోరెత్తించారు.

56వేల కోట్ల రాఫెల్ కుంభ‌కోణంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు కోరాయి. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తున్న డ్యామ్ సేఫ్టీ బిల్లును బీజేడీ వ్య‌తిరేకించింది. అయితే స‌భ్యుల నినాదాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో.. స్పీక‌ర్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates