రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం : ఉత్తమ్

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ.. గాంధీ భవన్ నుంచి ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ నేతలు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 580 కోట్లతో విమానాలు కొనేందుకు యూపీఏ సర్కార్ ఒప్పందం చేసుకుంటే.. మోడీ సర్కార్ 16 వందల కోట్లు పెట్టి కొందన్నారు. మన దేశంలో ఇప్పటివరకు అన్నీ యుద్ధ విమానాలు మానుఫ్యాక్చర్, అసెంబ్లీ చేసింది భారతప్రభుత్వ కేంద్ర సంస్ధ HAL అన్నారు. భారతదేశంలో మిగ్, జాగ్వార్, మిరాజ్ విమానాలకు కూడా HAL ద్వారానే టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, మ్యానుఫ్యాక్చర్ జరిగిందని ఉత్తమ్ తెలిపారు. అయితే ప్రభుత్వ రంగ సంస్ధ HALని తీసివేసి అనీల్ అంబానీ సంస్ధకు నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ కాంట్రాక్టు ఎలా ఇచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates