రాఫెల్ విషయం వల్లే చర్చలు క్యాన్సిల్ : పాక్

భారత్-పాక్ చర్చలు క్యాన్సిల్ విషయంపై స్పందించింది పాక్. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్లను పాకిస్థాన్‌ మంత్రి ఫవాద్‌ హుస్సైన్‌ రీట్వీట్ చేస్తూ.. రాఫెల్ విషయంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే..భారత్‌-పాక్‌ మధ్య ఐక్యరాజ్య సమితి సభ సందర్భంగా నిర్వహించాలనుకున్న చర్చలను క్యాన్సిల్ చేశారని చెప్పుకొచ్చారు. తాము భారత ప్రభుత్వ తీరుని ఖండిస్తున్నామని అన్నారు. భారత సర్కారు తమ దేశంపై ద్వేషాన్ని చూపేది అందరికీ తెలుసన్నారు.

రాఫెల్‌ ఒప్పందంలో జరిగిన అతి పెద్ద అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రధాని మోడీ.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలను క్యాన్సిల్ చేశారన్నారు ఫవాద్‌. భారత రక్షణ శాఖపై ప్రధాని మోడీ సర్జికల్‌ స్ట్రైక్ చేశారంటూ.. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్లను ఆయన రీట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు రాహుల్‌ చేసిన ట్వీట్ల ద్వారా తెలుస్తుందన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates