రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు: హరీశ్ రావు

harishraoతెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాబోయే రోజుల్లో రోష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాధారణ స్థాయి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు… ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SE,EE,DEE,AEE లు వారి హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్లవద్దన్నారు మంత్రి హరీశ్. వరదనీరు చేరుతున్న చెరువులు, ప్రాజెక్టులను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రాజెక్టుల స్పిల్ వే గేట్లు పని చేసే విధంగా అవసరమైన పనులు చేసుకోవాలన్నారు. వైర్ రోప్స్ కు గ్రీజింగ్ చేయాలని, విద్యుత్ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఒకవేళ చెరువులకు గండ్లు పడితే వెంటనే కలెక్టర్లు, పై అధికారులకు సమాచారం అందించి వాటిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి హరీశ్ రావు.

Posted in Uncategorized

Latest Updates