రామయ్య సేవలో తరించిన భక్తులు

భద్రాచలం : అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏరియా హాస్పిటల్‌ సమీపంలోని దసరా మండపంలో వైకుంఠ రాముడికి రాపత్తు ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకు ముందు ఉదయం గర్భగుడిలో మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరించారు.

ఉత్సవమూర్తులను సాయంత్రం ప్రాకార మండపానికి తీసుకొచ్చి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి దర్బారు సేవ నిర్వహించారు. అనంతరం వైకుంఠ రామున్ని ఊరేగింపుగా గోవిందరాజస్వామి ఆలయానికి, తిరిగి దసరా మండపానికి తీసుకెళ్లి అక్కడ  రాపత్తు ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో ప్రముఖ డాక్టర్లు ఎస్‍ఎల్ కాంతారావు, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates