రాముడే వచ్చి ఎన్నికల్లో పోటీచేసినా..డబ్బు పంచాల్సిందే

ఈ రోజుల్లో రాముడైనా సరే ఎన్నికల్లో డబ్బులు పంచకపోతే గెలవలేడన్నారు గోవా RSS మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్‌. పనాజీలో గోవా సురక్ష మంచ్‌ యువ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రెండు వర్గాల ప్రజలను ఆకర్షించడంలో బిజీగా ఉంటారు. ఒకరు యువత, మరొకరు మహిళలు. తమపై నమ్మకం కల్గించేందుకు నాయకులు వీరికి డబ్బు, గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఎన్నికల్లో డబ్బుకు అధిక ప్రాబల్యం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాముడొచ్చి పోటీ చేసినా.. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆయన గెలవలేరన్నారు సుభాష్.

వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయన్నారు. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయని… డబ్బు లేకపోతే ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమన్నారు సుభాష్ వెలింగ్కర్‌.

Posted in Uncategorized

Latest Updates