రాములోరి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

BHADRACHALAM SRIRAMAరాములోరి కల్యాణానికి  భద్రాచలంలోని మిథులా స్టేడియం ముస్తాబు అయ్యింది. సోమవారం (మార్చి-26)  మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం.. జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

ఇప్పటికే భద్రాద్రికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. మిథిలా స్టేడియం పరిసరాల్లో చలువ పందిళ్లు వేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో మిథిలా స్టేడియం వెలుగిపోతోంది. భారీ పోలీస్ భద్రతా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలంటున్నారు అధికారులు.

మంగళవారం (మార్చి-27) శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చి మహా పట్టాభిషేకం చేయనున్నారు. ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates