రామ మందిరం కోసం ఢిల్లీలో భారీ ర్యాలీ

 అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలంటూ  ‘మెగా మందిర్‌ మార్చ్’ ను వీహెచ్‌పీ ఆదివారం నిర్వహించింది.  ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ సంస్థల కార్యకర్తలు హజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మందిర్ మార్చ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగనుంది. ఈ ర్యాలీకి సుమారు రెండు లక్ష మంది హాజరవుతారని వీహెచ్‌పీ భావిస్తుంది. వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంట్ లో బిల్లు పెడితే ఎవరూ అడ్డుకొరని వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ సురేంద్ర జైన్‌ తెలిపారు. శీతాకాలం సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే భవిష్యత్తు కార్యాచరణను తర్వాతి సభలో ప్రకటిస్తామని చెప్పారు. తర్వాతి సభ.. అలహాబాద్‌లో జనవరి 31 నుంచి రెండు రోజులపాటు నిర్వహిస్తామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates