రాయల్ వెడ్డింగ్: ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ-మేఘన్

WEDక్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ల మ్యారేజ్ ఘనంగా జరిగింది. లండన్ విండ్సర్ క్యాసిల్‌లోని చర్చిలో వీరి పెళ్లి వందలాది ప్రముఖుల మధ్య జరిగింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. మేఘన్, ప్రిన్స్‌లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు. విండ్సర్ క్యాజిల్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది.

అందకుముందు ప్రిన్స్‌ను వివాహమాడేందుకు మేఘన్ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చుని స్వాగతం పలికారు. ఈ వివాహ వేడుకకు భారీ ఎత్తున అతిథులు హాజరయ్యారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతోపాటు ఇతర ప్రముఖులు డేవిడ్, విక్టోరియా బెక్హామ్, జార్జ్, అమల్, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.

మేఘన్ మెర్కెల్.. బ్రిటీష్ డిజైనర్ క్లేర్ వెయిట్ కెల్లర్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించి మెరిసిపోయారు. ప్రిన్స్ హ్యారీ రింగ్ ప్లాటినం బాండ్‌తో ఉండగా, మేఘన్ వెడ్డింగ్ రింగ్ వెల్ష్ గోల్డ్‌తో రూపొందించినట్లు కెన్సింగ్టన్ ప్యాలెస్ చెప్పింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కిల్‌కు బ్రిటన్ ప్రధాని థెరీసా మే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates