రాయొద్దు.. మాట్లాడొద్దు : ఇక నుంచి ‘దళిత’ పదం నిషేధం

dalitఇక నుంచి మీడియాలో దళిత పదాన్ని వాడవద్దని ఆదేశించింది ముంబై హైకోర్టు. మీడియాలో దళిత పదాన్ని నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసారాల ( I&B)మంత్రిత్వ శాఖకు సూచించింది హైకోర్టు. కోర్టు సూచనలను పాటించడానికి అంగీకరించింది ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ. ఈ విషయంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI)కు సైతం ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ముంబై హైకోర్టు నాగాపూర్ బెంచ్ గత వారంలో  I&Bకి, PCIకి ఈ ఆదేశాలు జారీ చేసింది.

మీడియాలో దళిత పదానికి బదులు షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్ అని వాడాలని, భారత రాజ్యాంగంలో దళిత పదం ఎక్కడ లేదని ముంబై హైకోర్టు అభిప్రాయపడింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇక నుంచి దళిత పదం నిషేధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దళిత పదాన్ని ఉపయోగించవద్దని కోర్టు ఆదేశాల మేరకు సలహా ఇచ్చింది ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత పదాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates