రాయ్ గడ్ మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం

మహారాష్ట్రలోని రాయ్‌ గడ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆ రాష్ట్ర సీఎం  దేవేంద్ర ఫడ్నవిస్ రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు  ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

శనివారం(జూలై-28) ఉదయం రాయిగడ్ జిల్లా పొలందపూర్ దగ్గర ప్రైవేటు బస్సు 500 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 30మంది చనిపోయారు. సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ వెళ్తుండగా… అంబెనలీ ఘాట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. 35మందితో వెళ్తున్న ప్రైవేట్ బస్సు… లోయలో పడిపోయింది. వీరంతా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా దాపోలీలో ఉన్న బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ క్రిషి విద్యాపీఠ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి చెందిన స్టాఫ్, స్టూడెంట్స్ గా గుర్తించారు. వీరంతా పిక్నిక్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Posted in Uncategorized

Latest Updates