రారాజు ప్రేమ : జింక పిల్లకు తల్లి ప్రేమ చూపిస్తున్న సింహం

Deerమనుషులకే కాదు జంతువులకి ప్రేమ ఉంటుందని నిరూపించింది. కనిపిస్తే చాలు.. వేటాడి వెంటాడి తినే సింహం.. ఓ జింక పిల్లపై చూపించిన ప్రేమ సోషల్ మీడియా ఊపేస్తోంది. అడవిలో రారాజు సింహం ఓ చిన్న జింక పిల్లపై ప్రేమను, ఆప్యాయతను చూపించింది.

ఓ మగ సింహం దాడిలో.. ఆడ సింహం రెండు పిల్లలను కోల్పోయింది. ఒంటరి అయ్యింది. తీవ్ర మనోవేదనతో ఉన్న ఆడ సింహంకి.. అడవిలో ఒంటరిగా తిరుగుతున్న  జింక పిల్ల కనిపించింది. మామూలుగా అయితే ఒక్క పంజాతో ఎముకలతో సహా తినేసేది. కానీ ఆ జింక పిల్లలో తన కూనలను గుర్తు చేసుకుంది. జింక పిల్లను చక్కగా సాకుతోంది. తల్లి ప్రేమ చూపిస్తోంది. ఈ అద్భుత దృశ్యాలను గార్డన్‌ డొనోవాన్‌ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. సింహాల ఫొటోలు తీయడం తనకు ఇష్టమని గార్డన్‌ చెప్పారు.  అందులో భాగంగానే.. జింక పిల్లను చంపడానికి వస్తున్న సింహం ఫొటోలు తీయటానికి రెడీ అయ్యాను. ఆలోపే షాక్ అయ్యాను.

నేను అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. సింహం జింక పిల్లను సంరక్షించడం అనేది అద్భుతం అన్నాడు. నమీబియాలోని ఈటోషా జాతీయ పార్కులో ఈ సింహం, జింక పిల్ల ఉన్నాయి. ఇది చూసినవారు ప్రేమ అనేది మనుషులకే కాదు.. అన్ని జంతువుల్లోనూ ఉంటుందని నిరూపించాయి ఇవి. ప్రేమకు శతృత్రం కూడా ఉండదని నిరూపించాయని చెబుతున్నాడు గార్డన్ డొనోవాన్.

Posted in Uncategorized

Latest Updates