రావయ్యా రా : వర్మకి పోలీస్ నోటీసులు

Ram-Gopal-Varmaసంచలనాలకు కేరాఫ్.. సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)పై నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని వర్మకి పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో వర్మ ఇవాళ(గురువారం-8) సీసీఎస్ ఎదుట విచారణకు హాజరుకావాల్సింది. విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు తెలియజేశాడు వర్మ. ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. వచ్చే వారంలో మళ్లీ నోటీస్ ఇస్తే.. వస్తానని తెలిపినట్లు సమాచారం. దీంతో మళ్లీ నోటీసులు పంపటానికి రెడీ అయ్యారు పోలీసులు.

వర్మ GSTపై చర్చ సమయంలో సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఆమె సీసీఎస్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ కేసులో వర్మకి నోటీసులు అందించారు.

Posted in Uncategorized

Latest Updates