రావు రమేష్ తల్లి కన్నుమూత

rao-gopal-rao-wifeప్రముఖ విలక్షణ నటుడు రావుగోపాలరావు భార్య కమలకుమారి కన్నుమూశారు. ఏప్రిల్ 7వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్ కొండాపూర్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కమలకుమారి స్టేజి ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. ఓ షోలో చూసిన రావుగోపాలరావు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో ఒకరు రావు రమేష్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తండ్రిగా, విలన్ గా నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి…రావు రమేష్ తల్లి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు.

Posted in Uncategorized

Latest Updates