రాష్టానికి స్కోచ్ అవార్డుల పంట : సిరిసిల్ల మున్సిపాలిటీకి 5 అవార్డులు

scరాష్ట్రానికి 11 స్కోచ్ అవార్డులు దక్కాయి. నూతన ఆవిష్కరణలు తీసుకువచ్చిన మున్సిపాలిటీలకు స్కోచ్ గ్రూప్ అవార్డులు ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన …52వ స్కోచ్ సమ్మిట్ లో …చైర్మన్ సమీర్ కొచ్చార్ అవార్డులు ప్రదానం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీ 5 అవార్డులు దక్కించుకోగా…. కరీంనగర్ నగరపాలక సంస్థకు మూడు అవార్డులు దక్కాయి. షాద్ నగర్, బోడుప్పల్, మరో రెండు ప్రభుత్వ సంస్థలకు ఒక్కో పురస్కారం లభించింది. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, LED లైట్లు, నూతన ఆవిష్కరణలు, మన సిరిసిల్ల సీనియర్ సిటిజన్ సర్వీసెస్ లకు నాలుగు పురస్కారాలు అందుకుంది సిరిసిల్ల పురపాలక సంస్థ. తర్వాత స్పెషల్ ప్రెస్టేజియస్ అవార్డును కూడా దక్కించుకుంది. హరిత హారం, LED లైట్ల ఏర్పాటు, వ్యర్థ పదార్థాల నిర్వహణలో …కరీంనగర్ కు మూడు అవార్డులు దక్కాయి.

Posted in Uncategorized

Latest Updates