రాష్ట్రంలో ఇవాళ్టితో ముగిసిన సర్పంచుల పదవీ కాలం

రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీ కాలం ఇవాళ్టితో ముగిసింది. రేపటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాలో 427, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 205 పంచాయతీలు ఉన్నాయి. ప్రజా ఓట్లతో ఎన్నికై… గ్రామాల అభివృద్దికి పనిచేసిన సర్పంచ్ లు…. చివరిరోజు కావడంతో… పంచాయతీ ఆఫీసుల్లో బిజీగా గడిపారు. గ్రామ అభివృద్దికి తమ పరిధిలో ఉన్న అన్ని నిధులను ఖర్చుచేశామన్నారు. అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
సర్పంచ్ ల పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో…నర్సాపూర్ పంచాయతీలో ఇంటి పర్మీషన్ల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు జనం. అయితే సాధారణ జనాన్ని పట్టించుకోకుండా… రియల్ వ్యాపారులకు అధికారులు సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు స్థానికులు. తలుపులు వేసుకుని వారికి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.

Posted in Uncategorized

Latest Updates