రాష్ట్రంలో కూడా : అన్ని హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌ పోర్ట్ సేవలు

POSTపాస్ పోర్ట్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు పాస్ పోర్ట్ కావాలంటే ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని..అది కూడా అప్లై చేసుకున్నాక మూడు నెలలకు వచ్చేది. పాస్ పోర్ట్ ఆఫీస్ దగ్గర పెద్ద క్యూ. త్వరగా కావాలంటే దళారులకు డబ్బులు ఇవ్వాల్సిందే. వీటికి చెక్ పెట్టింది ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా పాస్‌ పోర్టు సేవలను విస్తరించేందుకు 251 హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌ పోర్ట్ సేవలు ప్రారంభించింది. మొదటి విడతగా మే 18 నుంచి 192 హెడ్ పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, హన్మకొండ హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌ పోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates