రాష్ట్రంలో కొత్తగా 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు

LPGతెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. సూర్యాపేట  జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి…ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభించారు. 5 కోట్ల మందికి గ్యాస్ ఇవ్వటమే ఈ పథకం లక్ష్యమన్నారు.

సూర్యాపేటలో  ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. తెలంగాణలో మహబూబ్ నగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో ..ఇప్పటికి 40 శాతం ప్రజలకు గ్యాస్ అందుబాటులో లేదన్నారు. రాష్ట్రానికి కొత్తగా 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే 20 నాటికి దేశ వ్యాప్తంగా 15 వేల గ్రామాలను LPG పంచాయతీలుగా మారుస్తామన్నారు.  అర్హులైన లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ పత్రాలను అందించారు మంత్రి.

పేద మహిళల కళ్లలో కన్నీళ్లు చూడొద్దనే.. కేంద్రం ఉజ్వల పథకం తీసుకొచ్చిందన్నారు రాష్ట్ర బీజేపీ అధక్ష్యుడు లక్ష్మణ్. 5 కోట్ల మందికి గ్యాస్ ఇవ్వటమే ఈ పథకం లక్ష్యమన్నారు.   తెలంగాణలో కట్టెల పోయ్యి లేకుండా చేయటమే బీజేపీ లక్ష్యమన్నారు ఎంపీ దత్తాత్రేయ.

 

Posted in Uncategorized

Latest Updates