రాష్ట్రంలో వర్ష బీభత్సం..మార్కెట్లలో తడిసిన ధాన్యం

rainరుతుపవనాల రాకకు ముందే రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. నిన్న సాయంత్రం తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఉరుములు, మెరుపులు, గాలిదుమారం, పిడుగులతో కూడిన వర్షం కొన్నిచోట్ల బీభత్సం సృష్టించింది. పిడుగులతో ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మొలలగూడలో ఒకరు, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. వరద నీటితో మార్కెట్లలోని ధాన్యం తడిసి రైతులకు నష్టం జరిగింది.

Posted in Uncategorized

Latest Updates