రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. తడిసిన ధాన్యం

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంపై ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం (ఏప్రిల్-15) చాలా చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి జగిత్యాల, కరీంనగర్, వరంగల్ రూరల్, అర్బన్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే 48 గంటలు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది IMD. ఆదివారం వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దోమ, పరిగి, వికారాబాద్ మండలాల్లో కూడా మంచి వర్షమే కురిసింది

పోయినవారంలో కురిసిన వర్షంతో నష్టపోయిన రైతులు.. ఇవాళ్టి వానతో ఇంకాస్త దెబ్బతిన్నారు. చాలాచోట్ల కోతలు పూర్తై ధాన్యం కల్లంలో ఉండడంతో తడిసిపోయింది. అలాగే ఆరబెట్టిన మొక్కజొన్నలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. చాలాచోట్ల మామిడిపంటకూ నష్టం కలిగింది.  ఉపరితల ద్రోణికారణంగా పగటి ఉష్ణోగ్రతల్లో కాస్త తగ్గుదల కనిపించింది. భద్రాచలంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ లో 38.9,నిజామాబాద్ 38.5, ఆదిలాబాద్ 38, ఖమ్మం 37 డిగ్రీలు నమోదుకాగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 33 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Posted in Uncategorized

Latest Updates