రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి: ఎంపీ కవిత

kavitha
రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం ముందుకు రావటం లేదన్నారు MP కవిత. హైదరాబాద్ బేగంపేటలో పసుపు సాగు, ఎగుమతులపై ఏర్పాటు చేసిన వర్క్ షాపుకు హాజరయ్యారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఈ వర్క్‌షాప్ జరుగుతుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ముప్పై ఏళ్లుగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు..పసుపు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.

1990లో 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అయ్యేదని.. ప్రస్తుతం 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిపోయిందని తెలిపారు. సోనాలిక పసుపు వంగడంకు బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఇతర పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో స్పైస్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ కవిత.

Posted in Uncategorized

Latest Updates