రాష్ట్రంలో పెరగనున్న మెడికల్ సీట్లు

MEDICALరాష్ట్రానికి మెడికల్  సీట్ల వాటా పెరిగింది. ఇందులో  భాగంగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ కాలేజీకి 150 సీట్లను ప్రభుత్వ వైద్య మండలి మంజూరు చేసింది. రాష్ట్రలో 2019-20 లో కొత్తగా రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతున్నాయి. నల్గొండ, సూర్యాపేటలో కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది.  వైద్య ఆరోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ మంగళవారం(మే-22) సైన్ చేశారు. ఈ రెండు కాలేజీలకు చెరో 150 చొప్పున సీట్లు కేటాయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల 250 MBBS సీట్లున్నాయి. ఆరు ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 సీట్లున్నాయి. ఈ సంఖ్య 1,150 కు పెరిగింది. ODS కోర్సులో రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లున్నాయి.

Posted in Uncategorized

Latest Updates