రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలకు ఛాన్స్

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశాలున్నాయని… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్ లో నిన్న(బుధవారం) కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో…ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 

Posted in Uncategorized

Latest Updates