రాష్ట్రంలో ముగిసిన పోలింగ్… భారీగా పోలింగ్ శాతం నమోదు

రాష్ట్ర అసెంబ్లీ-2018కి జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ అంతటా ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ పర్సెంటేజీ కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే నమోదైనట్టు చెబుతున్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగా నాలుగింటికే పోలింగ్ ముగిసింది. ఈ 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడింటికే పోలింగ్ ప్రారంభమైంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ 8గంటలకు ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తం 70శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఉదయాన్నే ఈవీఎంలు, వీవీ ప్యాట్ , కంట్రోల్ యూనిట్లు పనిచేయడం లేదని కంప్లయింట్స్ వచ్చినప్పటికీ అధికారులు సమస్యలను అధిగమించారు. పనిచేయని యంత్రాల స్థానంలో కొత్తవాటిని అమర్చారు. వాతావరణ పరిస్థితుల వల్లే కొన్ని పనిచేయలేదని.. పోలింగ్ అంతటా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు చెప్పారు. సాయంత్రం ఐదింటివరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే వీలు కల్పించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates