రాష్ట్రంలో మొదటిసారిగా వీవీ ప్యాట్ మెషీన్స్.. మీ ఓటు ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్రంలోని ఓటర్లంతా ఇప్పటికే ఎన్నోసార్లు బ్యాలెట్ లో ఓటేశారు. ఈవీఎంలపైనా బటన్లు నొక్కడం తెలుసు. కానీ మొదటిసారిగా ఈసారి పోలింగ్ లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)కు వీవీ ప్యాట్ మెషీన్ ను జోడిస్తున్నారు. VVPAT అంటే వోటర్ – వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటు ఎవరికి పడిందో తెల్సుకునేందుకు ఉపయోగపడే యంత్రం అన్నమాట. ఈవీఎంపై ఓటు వేయగానే… వీవీప్యాట్ మెషీన్ లో ఓ స్లిప్ ప్రింట్ అయి వస్తుంది. ఏటీఎం సెంటర్లలో రిసీప్ట్ వచ్చినట్టుగా…. వీవీప్యాట్ మెషీన్ లోనూ స్లిప్ జెనరేట్ అవుతుంది. ఆ స్లిప్ పై ఓటు ఎవరికి పడిందో ప్రింట్ అయి ఉంటుంది. ఐతే.. ఆ స్లిప్ తీసుకోవడానికి వీలుండదు. వీవీ ప్యాట్ మెషీన్ పై ఉన్న గ్లాస్ తెరనుంచి ఆ రిసీప్ట్ ను చూడొచ్చు. ఆ స్లిప్ పైన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆ స్లిప్ కింద ఉన్న బాక్స్ లో పడిపోతుంది. నాట్ టు బి కౌంటెడ్ అని ఆ రిసీప్ట్ పై రాసి ఉంటుంది. అంటే.. పోలింగ్ సిబ్బంది ఆ రిసీప్ట్ లను లెక్కిస్తే అది నేరం అవుతుంది. ఈ వీవీ ప్యాట్ మెషీన్ ను ఎటువంటి టెక్నాలజీ కూడా ట్రాక్ చేయలేదు. వైఫై, బ్లూ టూత్, యూఎస్ బీ, ఇంటర్నెట్ లతో దీనిని కనెక్ట్ చేయలేం. పారదర్శకంగా పనిచేస్తుందని ఈసీ చెబుతోంది.

బ్యాలెట్ పేపర్ సిస్టమ్ బదులుగా.. ఈవీఎంలను మన దేశంలో పోలింగ్ సందర్భాల్లో వినియోగిస్తున్నారు. ఐతే… ఈవీఎంలతో ఓటింగ్ లో సాంకేతిక సమస్యలు ఉంటాయని ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పడంతో.. వీవీ ప్యాట్ మెషీన్లను జోడించారు. దీంతో… ఓటు ఎవరికి పడిందో ఓటరుకు కన్ఫర్మేషన్ ఉంటుంది. వేరేవాళ్లకు పడిందేమో అనే డౌట్ అవసరం లేదని ఈసీ చెబుతోంది. వీవీ ప్యాట్ మెషీన్లను మనదేశంలో 2013 సెప్టెంబర్ లో తొలిసారిగా నాగాలాండ్ లోని నొక్సేన్ అసెంబ్లీ సెగ్మెంట్  లో ఉపయోగించారు. 2013లో మిజోరం ఎన్నికల్లో 10 నియోజకవర్గాలల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్ లను వాడారు.

 

Posted in Uncategorized

Latest Updates