రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

హైదరాబాద్ : రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 15 రోజుల్లోనే ఏకంగా 125 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవటం, ఈ ఏడాదిలో స్వైన్‌ ఫ్లూ కారణంగా ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. నగరంలోని గాంధీ జనరల్‌ ఆసుపత్రిలో గత వారం రోజుల్లో 20 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయి.  ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సైతం స్వైన్‌ ఫ్లూ తో ఆస్పత్రిలో చేరారు. అందులో ముగ్గురు ఐఏఎస్‌లు, మరో నలుగురు డీఆర్‌వో, ఆర్డీవో స్థాయి అధికారులున్నట్లు తెలుస్తోంది. వీరి పేర్లు బయటపెడితే వారి వద్దకు ప్రజలు వెళ్లేందుకు ఇబ్బంది పడే అవకాశమున్నందున ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) అధికారులు వెల్లడించడం లేదు.

 

Posted in Uncategorized

Latest Updates