రాష్ట్రంలో 2వేల 630 రైతు వేదికల నిర్మాణం : కేసీఆర్

28276317_573817856306466_520938978208940656_nరాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ… సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి- రైతుల సంక్షేమం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతు సమన్వయ సమితి విధి విధానాల రూపకల్పనపై …ఈనెల 25, 26న ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని గురువారం (ఫిబ్రవరి-22) ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం.

విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చే వరకు …ప్రతీ దశలోనూ రైతు సమన్వయ సమితులు కీలక పాత్ర పోషించేలా సభ్యుల విధులు, బాధ్యతలు ఉంటాయని చెప్పారు. సమన్వయ సమితుల్లో …కనీసం 51 శాతం మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా చూస్తామన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున… రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 630 రైతు వేదికలు నిర్మిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. వేదికల నిర్మాణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని సూచించారు. రూ.200 కోట్ల మూలధనంతో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయసమితి పేరిట ఏర్పాటుచేసే కొత్త కార్పొరేషన్ వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో కృషిచేస్తుందని, లాభాపేక్షలేని సంస్థగా పనిచేస్తుందని అన్నారు.

రైతు కార్పొరేషన్‌కు సమకూరిన నిధులను నిర్దేశిత లక్ష్యాల సాధన కోసమే వినియోగించాలని సీఎం స్పష్టంచేశారు. గ్రామ, మండల రైతు సమన్వయసమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయసమితులు ఏర్పాటవుతాయని చెప్పారు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలకు మద్దతు ధర వచ్చేవరకు ప్రతి దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైనపాత్ర పోషించేలా వాటికి విధులు, బాధ్యతలు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కనీసం 51% బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా రైతు సమితుల నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates