రాష్ట్రం మొత్తం సందడే సందడి : మూడు రోజుల్లో 50వేల పెళ్లిళ్లు

marriages-telanganaరాష్ట్రానికి పెళ్లి కళ వచ్చింది. జూలై 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులు.. గురు, శుక్ర, శనివారాలు మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే వెయ్యి నుంచి 1200 పెళ్లిళ్లు ఈ మూడు రోజుల్లో జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే కళ్యాణ మంటపాలు ఫుల్ అయ్యాయి. క్యాటరింగ్ వాళ్లు బిజీ అయ్యారు. అన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోవటంతో.. హోటల్స్ లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

5, 6, 7తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నా.. 5వ తేదీ మాత్రం అద్భుతం అంటున్నారు. విళంబినామ సంవత్సరం.. స్వస్తిశ్రీ ఉత్తరాయణ గ్రేష్మ రుతువు, నిజజేష్ఠ మాసం, సప్తమి తిధి.. అందులోనూ గురువారం వచ్చింది. దీనికితోడు ఉత్తరభ్రద నక్షత్రం, సింహలగ్నం కావటంతో ఇంతకంటే మంచి బలమైన ముహూర్తం ఈ ఏడాదిలోనే లేదని కొంత మంది పండితులు అంటున్నారు. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపతుల జీవితం అన్యోన్యంగా ఉండటంతోపాటు కుటుంబం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

వచ్చే మూడు రోజులు ముహూర్తాలు దాటిపోతే.. మరో రెండు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు ఆషాడమాసం వస్తోంది. మళ్లీ ఆగస్ట్ 15వ తేదీ తర్వాత. అంటే రెండు నెలలు శుభకార్యాలకు అనువు కాదు. దీంతో పెద్ద ఎత్తున ఈ మూడు రోజుల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వరంగల్ పట్టణంలోనే 600 వివాహాలు జరుగుతుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 3వేలపైనే పెళ్లిళ్లు జరగబోతున్నాయి. వచ్చే మూడు రోజులు రాష్ట్రం పెళ్లిళ్లతో కళకళలాడుబోతున్నది. ప్రతి ఇంటికి కనీసం ఒక్క పిలుపు అయినా వచ్చి ఉంటుంది..

Posted in Uncategorized

Latest Updates