రాష్ట్రపతికి గవర్నర్, కేసీఆర్ ఘన స్వాగతం

హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శుక్రవారం ఢిల్లీ నుంచి స్పెషల్ విమానంలో హైదరాబాద్ కి వచ్చారు.  హకీంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ స్వాగతం పలికారు. పోలీసు ఉన్నతాధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజులు బస చేస్తారు కోవింద్. రేపు కరీంనగర్ కి వెళ్లనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోం జరగనుంది. సోమవారం తిరిగి ఢిల్లీ వెళ్తారు రామ్ నాథ్ కోవింద్ కోవింద్. రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రాష్ట్రపతి భద్రత చూస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates