రాష్ట్రపతి ఆవేదన : ఆ ఘటనలతో దేశం సిగ్గుపడుతుంది

President unnav70 ఏళ్ల స్వతంత్ర దేశంలో కతువా-ఉన్నావ్ లాంటి రేప్ ఘటనలు దారుణమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని.. గ్రౌండ్ రియాలిటీ అదే సూచిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలతో దేశం సిగ్గుపడుతుందన్నారు. మరోసారి ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.

కామన్వెల్త్ గేమ్స్ లో మెడల్స్ సాధించిన అమ్మాయిలందరినీ అభినందించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఓ వైపు విశ్వవేదికలపై మహిళలు-అమ్మాయిలు సత్తా చాటుతుంటే.. మరోవైపు కతువా-ఉన్నావ్ లాంటి ఘటనలు బాధిస్తున్నాయన్నారు. 70 జమ్మూ-కశ్మీర్ కాత్రాలోని మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు కోవింద్.

Posted in Uncategorized

Latest Updates