రాష్ట్రపతి నిలయంలో ముగిసిన ఎట్‌ హోం

హైదరాబాద్‌: శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ లో ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌,

హోం మంత్రి మహమూద్‌ అలీ, శాసనసభ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా తదితరులు హాజరయ్యారు. ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభివాదం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates