రాష్ట్రమంతటా ఒకటే పాలసీ : హరీష్ రావు

harishతెలంగాణ రాష్ట్రమంతటా ఒకటే పాలసీని అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. సీఎం సంకుచిత ధోరణితో ఆలోచించకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ మిషన్ భగీరథ కింద చెరువులను మంజూరు చేయాలని చెప్పారు… సీఎం ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం చెరువులను తీసుకుని అభివృద్ధి చేశామన్నారు మంత్రి. ప్రతీ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి జిల్లా కేంద్రం నుంచి డబుల్ రోడ్డు వేయమని సీఎం చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు ఆయన. గతంలో 31 లక్షల పెన్షన్లు ఉంటే ఇప్పుడు 41 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు హరీష్ రావు. పారదర్శకంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఆయా ఎమ్మెల్యేల చేతనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా పార్టీలకు అతీతంగా 119 నియోజకవర్గాల్లో చేపట్టామన్నారు హరీష్ రావు. సురక్షిత మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతీ గూడెం, గిరిజన తండా, గ్రామాల్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు కావాలనే అడుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు మంత్రి. రాష్ట్రమంతటా ఒకటే పాలసీ. ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతున్నాం. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలు, 119 ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వామ్యమే అని భావించిన సీఎం కేసీఆర్ అని కొనియాడారు హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates