రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కాకా వర్ధంతి

కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి నాలుగో వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు, నేతలు. బడుగు బలహీన వర్గాల అభివృద్దికి వెంకటస్వామి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.  హైదరాబాద్ సాగర్ పార్కులోని కాకా విగ్రహానికి నివాళులర్పించారు…కాకా కుటుంబ సభ్యులు. వెంకటస్వామి బతికి ఉన్నంత కాలం పేదల  కోసం తపించారన్నారు. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తన తండ్రి కాకాకే దక్కుతుందన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి.

జిల్లాల్లోనూ వెంకటస్వామిక వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా అంతటా కాకా విగ్రహనికి నివాళులర్పించారు టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు. పెద్దపల్లి, ధర్మారం, వెల్గటూరు, మంథని, గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగాయి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో టీఆర్ఎస్ నేత సజ్జత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. అటు పట్టణంలోని స్పూర్తి మానసిక వికాలంగుల కేంద్రంలో కాంగ్రెస్ నేత కొమురయ్య ఆధ్వర్యంలో వికలాంగులకు పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

మంచిర్యాల జిల్లాలోనూ కాకా వర్ధంతిని జరుపుకున్నారు ఆయన అభిమానులు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి,  లక్సెట్టిపేట, మందమర్రిలో వెంకటస్వామికి నివాళులర్పించారు ఆయన అభిమానులు. ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మంచిర్యాలలో కాకా ఫోటోకు పూలమాల వేశారు ఎమ్మెల్యే దివాకర్ రావు. పేదల అభివృద్దికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. అటు తెలంగాణ జాగృతి, యువజన విభాగం ఆధ్వర్యంలో నస్పూర్ సాయి వృద్దాశ్రమంలో పళ్లు, ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాకా వర్ధంతిని నిర్వహించారు నేతలు. ఈ సందర్భంగా కాకా చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ సెల్ నాయకులు రాజమలయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ సంఘాల నేతలు రాజవీరు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు కాకా ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాకా సేవలకు గుర్తుగా..పెద్దపల్లి జిల్లాకి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పద్మశాలి కాలనీలో వెంకటస్వామికి ఘనంగా నివాళులు అర్పించారు జనం. కాకా నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలవేసి…కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates