రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ శోభ

TAMZANరంజాన్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు.  తెలంగాణలోనూ అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేసి, ఒకరికి ఒకరి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో రంజాన్ శోభ కనిపిస్తోంది. మక్కామసీద్ దగ్గర సామూహిక ప్రార్థనలు చేశారు ముస్లింలు. వేలాది మంది రావడంతో.. శనివారం (జూన్-16) ఉదయం నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మసీద్ లోనూ.. మసీదు బయట.. పెద్దసంఖ్యలో ముస్లింలు నమాజ్ లో పాల్గొన్నారు.

రంజాన్ ముబారక్ చెప్పుకున్నారు. హైదరాబాద్ లోని అన్ని సెంటర్లలో రంజాన్ పండుగను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు ముస్లింలు. చిన్న, పెద్ద అంతా కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. మీరాలం ఈద్గా దగ్గర ప్రార్థనలు జరిపారు ముస్లిం సోదరులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates