రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

kcrరాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు,అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు  చేశారు.

TRS అధినేత, సీఎం కేసీఆర్  జన్మదిన వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు. సీఎం బర్త్ డే సందర్భంగా  కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మంచిర్యాలలో దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మందమర్రిలో విప్ ఓదెలు ఆధ్వర్యంలో విద్యార్థులకు పళ్లు, స్వీట్లు పంచారు. అటు కరీంనగర్ లో పేదలకు సబ్బులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గంగుల.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ పట్టణంలో ఎంపీ డీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆర్మూర్ లో కేక్ కట్ చేసి సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. సీఎం ఆయూరారోగ్యాలతో ఉండాలంటూ భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎంపీ లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. భూపాలపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి…రక్తదానం చేశారు నేతలు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట గొల్లబజార్ లో 64 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు మంత్రి. తర్వాత ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. అటు నుంచి పిల్లల మర్రి వెళ్లిన మంత్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ సాయంతో షూస్ ను పంపిణీ చేశారు. నకిరేకల్ లో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు కార్యకర్తలు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ సీఎం కేసీఆర్ బర్త్ డే ను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు.  దుబ్బాక, జహీరాబాద్, చేర్యాల, జిన్నారం, నర్సాపూర్ లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబురంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ నేతలు. అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల, జడ్చర్లలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. రక్తదాన శిబిరాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మిగిలిన జిల్లాల్లోనూ సీఎం బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కేక్ లు కట్ చేసిన కార్యకర్తలు…ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates