రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు మరోసారి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జల్లా రెడ్డి సంక్షేమ భవన్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకోవడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీలేదన్నారు. తెలంగాణ ఏర్పాటే అప్రజాస్వామికమని టీడీపీ  తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అలా ఐతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కూడా అప్రజాస్వామికమేనన్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను తప్పుడు దారిలో ఆంధ్రాలో కలపలేదా..అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్న కాంగ్రెస్.. తెలంగాణకు మాత్రం పారిశ్రామిక ఇన్సెంటివ్ ఎందుకు అడగడం లేదని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోవా అని అన్నారు మంత్రి హరీశ్ రావు.

 

Posted in Uncategorized

Latest Updates