రాష్ట్రానికి త్వరలో ప్రైవేట్ యూనివర్సిటీలు

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు అడుగుపెట్టబోతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌‌‌‌ రావడంతో వచ్చే అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో అడ్మిషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీచేయనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తం 282 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి. ఏపీలో ఇటీవలే రెండు ప్రైవేటు వర్సిటీలు స్టార్టయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 11 వర్సిటీలు ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలతో సంప్రదాయ వర్సిటీల ప్రాధాన్యం తగ్గుతుందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

 గైడ్‌‌లైన్స్‌ రెడీ

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసేందుకు ఉన్నత విద్యామండలి రెడీగా ఉంది. ప్రభుత్వం  ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. యూనివర్సిటీ ఏర్పాటుకు మున్సిపాలిటీల పరిధిలో పదెకరాలు, నాన్‌ మున్సిపాలిటీ ఏరియాల్లో 20 ఎకరాల స్థలం ఉండాలి. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా కార్పస్ ఫండ్‌‌‌‌కింద రూ.30 కోట్లు డిపాజిట్‌ చేయాలి. ఇప్పటికే భవనాలు, వనరులు ఉన్న విద్యాసంస్థలకు ఫండ్‌‌‌‌ తగ్గుతుంది. అందించే కోర్సుల నుంచి వసూలు చేసే ఫీజుల వరకు అన్ని వ్యవహారాలు వర్సిటీ యాజమాన్యాల చేతుల్లో ఉంటాయి.

నో రిజర్వేషన్స్‌.. ఓన్లీకోటా

కుల, మత, లింగ పరమైన రిజర్వేషన్లు ఈ వర్సిటీల్లో ఉండవు. రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలనే నిబంధనను ప్రభుత్వం అమలుచేస్తుం ది. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీ ఏర్పాటు కోసం రిలయన్స్‌తో పాటు అమెరికాకు చెందిన జార్జియా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక రాష్ట్రంలోని పెద్ద విద్యా సంస్థలు కూడా వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates