రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(అక్టోబర్20) రాష్ట్రంలో పర్యటనకు వస్తున్నారు. అసెంబ్లీ రద్దయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్… కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఊపునివ్వబోతున్నారు. భైంసా, కామారెడ్డిల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి మ.12.30కి నిర్మల్ జిల్లా భైంసా చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత.. మధ్యాహ్నం 2.30 నుంచి… 3.30 వరకు కామారెడ్డి సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఐదింటివరకు హైదరాబాద్ వస్తారు రాహుల్ గాంధీ. చార్మినార్ ఏరియాలో రాజీవ్ గాంధీ సద్భావనా కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.

హైదరాబాద్ చార్మినార్ లో రాహుల్ గాంధీ కార్యక్రమం ఉండటంతో సిటీ పోలీసులు అలర్టయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం ఐదింటినుంచి రాత్రి ఎనిమిదింటివరకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి… పీఎన్టీ జంక్షన్, క్యాంపాఫీస్, రాజ్ భవన్, ఖైరతాబాద్ చౌరస్తా, రవీంద్రభారతి, గన్ ఫౌండ్రీ, ఆబిడ్స్, ఎంజే మార్కెట్, బేగంబజార్, నయాపూల్, మదీనా, హైకోర్టు, లాడ్ బజార్ మీదుగా చార్మినార్ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు గమనించాలని… సహకరించాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates