రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: జానారెడ్డి

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శలు గుప్పించారు. హామీలను నెరవేర్చకుండా  తప్పించుకోవడానికే కేసీఆర్… ప్రభుత్వాన్ని రద్దు చేశాడన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు ఏ మొఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల్లోకి వెళుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మజ్లిస్ తో .. కేంద్రంలో మోడీతో కలిసి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఫైరయ్యారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అన్నీ వైఫల్యాలేనని విమర్శించారు జానారెడ్డి.

Posted in Uncategorized

Latest Updates