రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్‌

rajathతెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల ప్రధాన అధికారి (CEO) గా రజత్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (ఫిబ్రవరి-19) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్‌ సమావేశమై తెలంగాణకు కొత్త CEO గా ఆయనను ఎంపిక చేసింది.

1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్‌ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి-20) రీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర కేడర్‌కు చెందిన IAS అధికారులు శశాంక్‌గోయల్‌, రజత్‌ కుమార్‌, నవీన్‌మిట్టల్‌ పేర్లను రాష్ట్రం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించగా.. రజత్‌కుమార్‌ను ఎంపిక చేసింది.

Posted in Uncategorized

Latest Updates